తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 17 December 2016

రామచంద్రుని రక్షించు రావణుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామచంద్రుని రక్షించు రావణుండు.



అశోకవనిలో రాక్షస స్త్రీలు సీతతో...


తేటగీతి: 
శోకమును బాపి నిన్ను యశోకవనిని
మార్చి చేరుచుగా తన మందిరమున 
మాదుమాటలవిని సీత ! మరువ నిపుడు 
రామచంద్రుని, రక్షించు రావణుండు.

No comments: