శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - హరుడె హరియు తెలియ హరియె హరుడు

సీసము:
నెమలి పించ మిచట నెలవంక యచ్చట
నగలేమొ యిట కాల నాగు లచట
చూడ చక్రమిచట శూలమ్ము గననట
గ్రద్ద యిచట బొల్లి యెద్దదియట
గట్టి వలువలిట గజచర్మ మచ్చట
గంధమిచట బూది కంపులచట
నల్లరూపమిచట తెల్లని మేనట
లచ్చి యిచట గన బిచ్చ మచట
ఆటవెలది:
పైకి జూడనిట్లు బాగుగా భేదమ్మె
లోతు దెలియుడయ్య రీతి దెలిసి
హరిని హరుడు నిలచు హరు లోన హరియుండు
హరుడె హరియు తెలియ హరియె హరుడు.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - హరుడె హరియు తెలియ హరియె హరుడు

సీసము:
నెమలి పించ మిచట నెలవంక యచ్చట
నగలేమొ యిట కాల నాగు లచట
చూడ చక్రమిచట శూలమ్ము గననట
గ్రద్ద యిచట బొల్లి యెద్దదియట
గట్టి వలువలిట గజచర్మ మచ్చట
గంధమిచట బూది కంపులచట
నల్లరూపమిచట తెల్లని మేనట
లచ్చి యిచట గన బిచ్చ మచట
ఆటవెలది:
పైకి జూడనిట్లు బాగుగా భేదమ్మె
లోతు దెలియుడయ్య రీతి దెలిసి
హరిని హరుడు నిలచు హరు లోన హరియుండు
హరుడె హరియు తెలియ హరియె హరుడు.
No comments:
Post a Comment