తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 18 June 2016

రామపాదమ్ము రమణిని రాయి జేసె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రామపాదమ్ము రమణిని రాయి జేసె. తేటగీతి: 
రామ నామము మరియును రామ భక్తి
తనకు నున్నట్టి సిరిసంపదనెడు తలపు 
తృణము జేసెను ధనమును, తెలియ మణియె 
రామపాదమ్ముర, మణిని రాయి జేసె.

No comments: