తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 17 June 2016

ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు.తేటగీతి: 
ముక్కు మీదను పద్యమ్ము ముద్దుగాను
నంది తిమ్మన పలికెను నాడటంచు 
చెప్ప నిట్టుల జరిగెను చిన్న తప్పు
ఘనుఁడు " తిక్కన " యష్టదిగ్గజములందు.

No comments: