మన గాన కోకిల సుశీల గిన్నిసు బుక్ లో స్థానము సంపాదించిన సందర్భంగా...

సీసము:
భక్తిగీతము విన పారవశ్యముగల్గు
ప్రేమ గానమనిన ప్రీతి గలుగు
చిలిపి పాటలకును చెంగున మనసూగు
పంచదారలు పంచు బాలగీతి
కడువిషాదపుపాట కళ్ళనేచెమరించు
హాస్యగీతి మనసు హాయినింపు
వీణపాటలలోన విఖ్యాతమీగొంతు
లాలిపాటలకును మేలుమేలు
ఆటవెలది:
పీసుశీలయనగ ప్రియమైనకోయిల
తెలుగు గాన లతకు తీపికొమ్మ
స్పష్టమైన స్వరము సరితెలుంగు వరము
చేరె ' గిన్నిసునను ' జేలు జేలు.
No comments:
Post a Comment