శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - లవకుశులకు వాల్మీకి విద్యాబోధన.
కందము:
స్తవనీయ రామ చరితము
శ్రవణమ్ముల కింపు గొలుపు రాగమ్ములతో
లవ కుశులకు నేర్పించితి
వవనిజనే గాచినట్టి యాదికవి! మునీ!
No comments:
Post a Comment