తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 3 September 2013

రామనామ మహిమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - రామనామ మహిమ
తేటగీతి:
రామ నామము తో కోతి రాటు దేలు
రామ నామము తో నీట రాళ్ళు దేలు
రామ నామము గూల్చును రాక్షసులను
రామ నామము గూర్చును రక్ష యిలను  

4 comments:

Sharma said...

చాలా చాలా చక్కగా వ్రాశరు .

గోలి హనుమచ్చాస్త్రి said...

శర్మగారూ ! ధన్యవాదములు.

Unknown said...

బాగుందండీ ! రోజూ మీ పద్యాలు చదువుతూనే ఉంటాను ...కృష్ణాష్టమి రోజు మీకు శుభాకాంక్షలు చెపుదామనుకుంటే సమయానికి కుదరలేదు ...

"విహాయ కోదండ శరౌ ముహూర్తం ,
గ్రహాణ పాణౌ మణి చారు వేణుం ,
మాయుర బర్హంచ నిజోతమంగే ,
సీతా పతే త్వాం ప్రణమామి పశ్చాద్ "

కృష్ణ కర్ణామృతం లో ఈ పద్యం నాకు చాల ఇష్టమైనది ..దీనిని ఎవరైనా తెనిగిస్తే చదువుకోవాలని కోరిక ..మీకు వీలయితే .....

గోలి హనుమచ్చాస్త్రి said...

వంశీ గారూ ! ధన్యవాదములు.
మీరు అడిగిన అనువాదమును శంకరాభరణం లో నైతే మిత్రులు, పెద్దలు చక్కని పద్యము ఇవ్వగలరు.సంస్కృత పరిజ్ఞానము అంతగా లేనివాడను. వీలైతే నేనూ ప్రయత్నిస్తాను.