తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 18 September 2012

రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే.

కందము:
ఆ మహనీయుల శాపము
క్షేమముగా తొలగ జేయ చెప్పిన యటులే
భూమికి దిగె నా హరియే
రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే.

No comments: