తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 7 September 2012

కాలునమ్మి కొలిచి కాలు గెలిచె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కాలునమ్మి కొలిచి కాలు గెలిచె.

ఆటవెలది:
మగని ప్రాణ మొకటి మగువ సావిత్రియె
యముని వెంట బడుచు నడిగె వరము
ఆత్మ సంథ  మంది యలుపునే బొందక
కాలునమ్మి కొలిచి కాలు గెలిచె.

No comments: