తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 17 June 2012

అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.

తేటగీతి :
అర్థ రాతిరి నే ఫోను నన్నగార్కి 
చేయ జెప్పెను యర్చన జేయుచుంటి 
ఇతర దేశము నందలి యన్న జూడ   
అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.  

2 comments:

subbarao said...

sir,namaste. tetagiiti kadaa

గోలి హనుమచ్చాస్త్రి said...

సుబ్బారావు గారూ ! 'త్వ(పొ )ర పాటున' కందము అని వ్రాసాను.తేటగీతి గా సరిచేసాను.మీ సూచన కు ధన్యవాదములు.