తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 16 June 2012

మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

కందము:
తగవుల దీర్చును, గ్రామపు   
మగువలు మగవారు మెచ్చు మాటలు జెప్పున్
తగు పెద్దరికము జేయును 
మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్. 

1 comment:

కమనీయం said...

జగమెరిగిన సత్యమ్మే
వగలాడి చెయిదము చిరుత ప్రాయమునందే
తగ దెలియు మేనమామకు
మగడెరుగని మర్మములవి మామ యెరుంగున్!