శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
గౌరి పెద్దన్న పేరేమొ కనకరాజు
'కనక' మామయ్య పిల్లను 'కపి ' యటంచు
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
'కపిని' కళ్యాణ మాడెను గౌరి కొడుకు.
సమస్య - కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు
కందము :
'కనక' మామయ్య పిల్లను 'కపి ' యటంచు
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
'కపిని' కళ్యాణ మాడెను గౌరి కొడుకు.
4 comments:
సమస్యకు తగ్గ పూరణం
భావ రాజు గారూ ! బ్లాగును వీక్షించి మీ భావమును వ్యక్తము చేసినందులకు ధన్యవాదములు.
ఛాయచిత్రము నందున చక్కదైన
బాలికను జూపి సమ్మతి బడసి ,వేరు
పాపనున్ గట్టబెట్టిరి రూపమందు
కపిని కళ్యాణమాడెను గౌరికొడుకు.
--------------
కమనీయం గారూ ! కపిని ' కట్టబెట్టిన' మీ పూరణ బాగుంది.అభినందనలు.
Post a Comment