శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - నాస్తికులకు దేవతలన్న నయము భయము
సమస్య - నాస్తికులకు దేవతలన్న నయము భయము
తేట గీతి:
తలుపు మూసిన వెలుగులు దాటిరావు
అడుగకున్నను తెరచిన ఆక్రమించు
తలపు తెరిచిన దూరును దైవమనుచు
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
అడుగకున్నను తెరచిన ఆక్రమించు
తలపు తెరిచిన దూరును దైవమనుచు
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
తేట గీతి:
తలపు మూసిన *దూరును దైవమనుచు
ఆస్తికులకు దేవతలన్న నయము భయము
తలపు తెరిచిన 'దూరును' దైవమనుచు
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
ఆస్తికులకు దేవతలన్న నయము భయము
తలపు తెరిచిన 'దూరును' దైవమనుచు
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
*దూరు = నిందించు, తిట్టు
'దూరు' = ప్రవేశించు
No comments:
Post a Comment