తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 17 December 2011

భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య - భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె

              భరతుడు శ్రీ రాముని తో ....

తే.గీ:  'అన్న వదినెల వదలక నహరహమ్ము
          సేవ జేయుచు నుందును చెంత ' ననుచు
          పరగ లక్ష్మణు కిచ్చిన భాగ్యమందు
          భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె

3 comments:

osankara said...

bhratudu ramuni yedirimchadam ane samasya ni poorinchaledu meru.

bharatudu ramuni yedirinchadam anedi yetti paristitulalo jarugadu,

kabatti meru samasyani poorinchaledu ani nenu anukuntunnanu

tappu matladite,kshaminchandi

గోలి హనుమచ్చాస్త్రి said...

ఓశంకర్ గారూ! బ్లాగును వీక్షించి చక్కని వ్యాఖ్య చేసినందులకు ధన్యవాదములు.
లక్ష్మణుని కిచ్చిన ' అన్న వదినెలసేవ జేయుచు నుండు భాగ్యమందు' భరతుడు భాగ మడిగాడండీ....తప్పేముందీ..రాముని మనసు గదిలో ఒక భాగ మడిగాడనుకుందాం..
తరచూ బ్లాగును సందర్శించి వ్యాఖ్యలు చేయుటను అభిలషిస్తూ...

సంపత్ కుమార్ శాస్త్రి said...

హనుమచ్చాస్త్రి గారూ,

యీ సమస్యను సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారికి ద్విసహస్రావధానములో ఇచ్చినది. దానిని అవధాని గారు పూరించిన పద్ధతి........

అకట కష్టాల కడలి నీకొకనికేన,
సుఖ సముద్రముదేలగ సఖులెయంత,
నన్నుమరచితివేమొ రామన్న యనుచు,
భరతుడెదిరించి రాముని భాగమడిగె.