తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 13 November 2011

ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02- 07 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


               సమస్య - ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

 శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయగుం శివ:
(మాయాబజార్) మయా దర్పణం లో చూసిన  వారికి  తమకు ఇష్ట మైనది కనబడుతుంది.

ఆ.వె:  మాయ దర్పణమ్ము మహాదేవుడే జూడ
          తనదు మోము బదులు తారసిల్ల ,
          శంఖ చక్రములతొ శయనించి యున్నయు
          పేంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.  

1 comment:

కమనీయం said...

వరము లిచ్చి ప్రోవ భస్మాసురుండను
ద్రోహి వెంటబడగ ,ద్రుంచి వాని
నఖిల జగము గాచె నట్టి విశ్వాత్మును
పేంద్రు నకును మ్రొక్కె చంద్రధరుడు.