తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 12 November 2011

కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            సమస్య -  కాంతా  రమ్మనెను యోగి  కడు మోహమునన్

కం:  చింతలు దీర్చగ కావలె
        కాంతారమ్మనెను యోగి, కడు మోహమునన్
        వింతల లోకము దగులక
        చింతనతో తపము జేయ చిట్టడవియె మేల్ ! 

కాంతారము = అడవి  

1 comment:

Disp Name said...

కార్యమునందు కర్మయోగి
మనో నాదుడే మెచ్చగ భక్తీ యోగి
గృహస్త ఆశ్రమున ఉన్న ఆ యోగి,
కాంతా రామ్మనేను కడు మొహమునన్