తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 23 October 2011

"క, చ, ట, త, ప" అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 17-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య - "క, చ, ట, త, ప" అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి


ఆ.వె: వెలుగు లీను విశ్వ విభుడైన రాముని
         మోము జాబిలాయె, ముగ్ధ యైన
         మైథిలీ ముఖమ్ము మందమౌ వెన్నెల
         జల్ల, వేరు గాని జంట యైరి. 

2 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

నిషిద్ధవర్ణముల్ త్యజించి,నేర్పు మీర పద్యముల్
వసుంధరన్ మహాకవుల్ ప్రభావ మొప్ప వ్రాతురే!
లసన్మనోజ్ఞ సత్ స్వభావ! లక్షణ ప్రశస్తమై
పసందుగా రచించనేర్చి, భాగ్యశాలివైతివే!

గోలి హనుమచ్చాస్త్రి said...

ఆర్యా ! రామకృష్ణారావు గారూ ! ధన్యవాదములు.