తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 13 October 2011

గణపతి సుముఖుండు కాడు కాడు....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 01-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


        సమస్య - గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్

కం: గుణ రహితము, రంగుల ప్రాం
       గణముల విషపూ రితమ్ము ఘనముగ నుండే
       గణపతి ప్రతిమల పూజకు
       గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్!

1 comment:

కమనీయం said...

అణకువయు ,భక్తియును,స
ద్గుణములె ముఖ్యము ,ధనికుడు,దుష్టాత్ముండై
మణులను బూజలు చేసిన
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్.