తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 12 October 2011

ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 31-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
 
           సమస్య -  ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్

కం:  ఆపతు లేవుర సతి ? సీ
        తా పతి పేరెవరికొప్పు ? తనయుని తండ్రే
        రూపము? సుత సుత ఏమౌ ?
        ద్రౌపది - రామునకు - భర్త - దౌహిత్రియగున్ ! 

4 comments:

శ్యామలీయం said...

'ఉంది' అన్నది సాధుపదప్రయోగం కాదు.

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీ ' శ్యామలీయం ' గారికి సుస్వాగతము.మొదటిసారి ఈ బ్లాగును దర్శించి అమూల్యమైన సూచన చేసినందులకు ధన్యవాదములు.
మీ సూచన ప్రకారము 'ఉంది' అన్న సాధుపదప్రయోగం తొలగించి ఇలా మార్చు చున్నాను.
" సీతాపతి పేరెవరికొప్పు " అంటే సరిపోతుందనుకుంటాను.
తరచూ బ్లాగును సందర్శించి మీ అమూల్యమైన సలహా ల నీయ వలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదములు.

శ్యామలీయం said...

తప్పక.
అన్నట్లు, మీరు నా బ్లాగులు దర్శించవలసిందిగా ఆహ్వానం.

శ్యామలీయం, గేయరచన
http://syamaliyam.blogspot.com/
http://geyarachana.blogspot.com/

శ్యామలీయం said...

అలాగే శాస్త్రిగారూ.
మీరుకూడా నా బ్లాగులు సంరదశింవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.

http://geyarachana.blogspot.com/
http://syamaliyam.blogspot.com/