తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 24 September 2011

గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


          సమస్య - గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్

కం:  బీర్బలు,అక్బరు కథ సం
       దర్భసహిత వ్యాఖ్యల పతి దరి జేరి సతిన్
       గర్భము నిమురుచు జెప్పగ,
       గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్! 


                 సమస్య -  గర్భ మందు బిడ్డ గంతు లిడెను.


ఆ.వె:  ఆడ పిల్ల లోన  నైనచో  తొలగించు
          మనగ  తల్లి; యిట్టి మలిన జగతి
          పుట్టి 'మునుగు' కన్న, 'పుట్టి ముంచు' డనుచు
           గర్భ మందు బిడ్డ గంతు లిడెను.  

3 comments:

aravind Joshua said...

గర్భంబున నున్న బిడ్డ గంతులువేసెన్..నాకు కవిత్వం రాయడం రాదు గానీ బైబిల్ లో ఇటువంటి సంఘటన ఒకటి రాయబడివుంది. యేసుని గర్భంలో మోస్తున్న మేరీ తన సమీప బంధువైన ఎలిజబెత్ ని దర్శించినపుడు, ఎలిజబెత్ గర్భంలో ఉవున్న యోహాను ఆనందంతో గంతులు వేసాడట. అప్పుడు ఎలీజబెత్ సంతోషంతో బిగ్గరగా "నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?" అని ప్రవచించిందట. ఆ యోహానే పెరిగి యేసుకి నీళ్ళతో బాప్తీసమిచ్చినట్టు తర్వాత చదువుతాం. - కృతజ్ఞతలు.

కమనీయం said...

గర్భంబునబెరిగెడి యా
అర్భకుడు వినగ నుతించె నరవిందాక్షున్
నిర్భయముగ నారదముని
గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్

గోలి హనుమచ్చాస్త్రి said...

అరవింద్ జోషువ గారూ! బ్లాగునకు స్వాగతం. రసాస్వాదన చేయగల హృదయము గలమీరు బ్లాగును దర్శించి చక్కని సందర్భోచిత వ్యాఖ్య చేసినందులకు ధన్యవాదములు.
కమనీయం గారూ ! ప్రహ్లాదుని జననానికి సంబంధించిన చక్కని పద్యాని చెప్పారు. అభినందనలు. "నుతించ" అంటే అర్థం ఇంకా సుగమంగా ఉంటుందని నా భావన. ధన్యవాదములు.