తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 23 September 2011

నర సింహుండాగ్రహించి నరకుని జంపెన్...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

        
            సమస్య - నర సింహుండాగ్రహించి;నరకుని జంపెన్


కం:  వరబాలు దండ్రి జంపెను
       నరసింహుండాగ్రహించి;నరకుని జంపెన్
       హరి,హరి సంహా రకుడౌ
       వర గర్విత దుష్టులైన వారల కెల్లన్ ! 

కం:  నరపతి పుత్రిక లందర
       జెరబట్టిన నక్కబోలు  జిత్తుల మారిన్!
       హరి,కృష్ణుడు,యాదవ వర
       నర సింహుండాగ్రహించి;నరకుని జంపెన్!
 

2 comments:

Rajasekhara Sarma said...

శాస్త్రి గారూ చక్కగావుంది మీపూరణ

గోలి హనుమచ్చాస్త్రి said...

రాజశేఖర శర్మ గారూ ! బహుకాల దర్శనం. ధన్యవాదములు.