తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 10 July 2011

శంకరాభ(పూ)రణం - మెల్ల కన్ను వలన మేలు కలిగె .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                        సమస్య :  మెల్ల కన్ను వలన మేలు కలిగె. 


ఆ.వె :  బలినొసంగ నెంచి మాంత్రికుండొక్కడు
           మాటు వేసి పట్టి 'మంగ పతిని'
           వాని కళ్ళు చూచి, వదలెను వలదని
           మెల్ల కన్ను వలన మేలు కలిగె. 

2 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

భార్య ప్రక్కనున్న పడతి అందాలను
రసికుడొకడు చూచి రక్తి నొందె -
భర్త చూపు భార్యపై ననుకొనిరెల్ల -
మెల్ల కన్ను వలన మేలు కలిగె!

గోలి హనుమచ్చాస్త్రి said...

ఫణీంద్ర గారికి నమస్కారములు.సుస్వాగతం.
నా బ్లాగును వీక్షించి సరస పూరణను చవి జూపిన మీకు ధన్యవాదములు.