శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.
సమస్య: చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.
తే.గీ: వనితలిర్వురు కొనరాగ వస్త్రములను
సేల్సు మ్యానట జూపుచు చీరనొకటి;
కట్టనిటులుండు, నన్నిటు గాంచుడనుచు
చీర గట్టెను పురుషుండు, సిగ్గు పడక.
No comments:
Post a Comment