తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 26 March 2011

దత్తపది - దోస, వంగ , బీర , కంద.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్సిన  దత్తపదికి నా పూరణ.


                  దత్తపది : దోస, బీర, వంగ, కంద.


                 సీతాపహరణం తరువాత రావణునితో మండోదరి అన్న మాటలు.


ఉ. శ్రీ రఘు రామచంద్రు సతి సీతను దెచ్చుట దోసమేగదా !
     కారణమద్దిజాలు!మనకందర కొచ్చును  ముప్పు! క్షేమమా 
     వీరుని యాశ్రయించ,  వినవే! గెలువంగలనంచు పోరులో, 
     బీరము లాడబోకుమ విభీషణు మాటల నాలకింపుమా!

3 comments:

Rajasekhara Sarma said...

annagaru, meeru dosa, kamda, vamga, beera kuragayalathoti kammani vamtakamunu chesinaru

Rajasekhara Sarma said...

annagaru, meeru dosa, beera, vanga, kanda kuragayalatho
kammani vantakam chesinaru
dhanyavadamulu

గోలి హనుమచ్చాస్త్రి said...

తమ్ముడూ! వంటకం రుచిగా వుందని భావిస్తున్నాను.మీలా రుచి చూసి చెప్పగలవారు తరచు బ్లాగును వీక్షించి బాగోగులు తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను.ధన్యవాదములు.