తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 25 March 2011

దత్త పది - రవి, గురు, కుజ, బుధ.

గతములో ఆకాశవాణి సరసవినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపది   కి చేసిన పూరణ. 

దత్తపది : రవి, గురు, కుజ, బుధ... కందము, రామాయణార్థం  లో 

కం. గురు సమ్మతమును గైకొని  
       చురుకుగ రవి కుల తిలకుడు సూత్రము  లాగన్
       హర కార్ముకంబు ధబ్బున
      విరుగన్ రాముకు జనకజ  వేసెను మాలన్. 















4 comments:

వసంత కిశోర్ said...

శాస్త్రి గారూ !
మీ బ్లాగు బాగుగ యున్నది !
దినదిన ప్రవర్థమాన మవ్వాలని కోరుకొంటున్నా !

గోలి హనుమచ్చాస్త్రి said...

వసంత కిశోర్ గారికి స్వాగతం.
కిశోర్ గారూ! ధన్యవాదములు.
మీ వీక్షణములకై సదా ప్రతీక్షించుచుంటాను.తరచూ బ్లాగును వీక్షించి మీ అమూల్యములైన అభిప్రాయములు తెలుపవలసినదిగా కోరుచున్నాను.

మిస్సన్న said...

దత్తపదులకు మీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి శాస్త్రి గారూ.

గోలి హనుమచ్చాస్త్రి said...

మిస్సన్న గారూ ! స్వాగతం. నా సమస్యల 'పూ' రణాన్ని వీక్షించినందులకు ధన్యవాదములు.తరచు వీక్షించి సమీక్షించవలసినదిగా కోరుచున్నాను.