తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 21 March 2011

జనవరి ౨౦౧౧ సుజనరంజని

 జనవరి 2011 సుజనరంజని వెబ్ పత్రికలో ఇచ్చిన సమస్యలకు పూరణములు.

             సమస్య : బేరమాడబోతె నేరమాయె.


      ఆ.వె.|| తారలంటి దిరుగు ధరలుజూడ మనకు
             తిరుగుచుండె తలలు తినగ కొనగ 
             ఘోరకలిని నేడు,కూరగాయలుగూడ  
             బేరమాడబోతె నేరమాయె.


సమస్య : లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ



 
 తే.గీ.|| నగలు దోచంగ నంగడి నక్కి యొకడు  
        సర్దబోవంగ చెయివేయ సైరనపుడె
        మ్రోగి దొరుకంగ గార్డుకు, మ్రోగె వీపు 
        లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ 
          

 


                       తెలుగు పాటశాల - ఘంటసాల
సీ.||  జానపదమొకండు - జనులు మెచ్చగపాడు
                  పద్యంబెయొక్కడు - పాడగలుగు
      లలితగీతమొకడు - లయబద్ధముగబాడు
                  శ్లోకంబుకొక్కడు - శోభదెచ్చు
      శాస్త్రీయమొక్కడు - శ్రావ్యంబుగాపాడు
                 కీర్తనతొ యొకండు - కీర్తిబొందు
      భక్తి గీతమొకడు - రక్తిగా పాడును
                పాశ్చాత్యమొక్కడు - పలుక గలుగు
 
.వె.||    ఎట్టిపాటలైన యే శ్లోకములుయైన
           పద్యమైన మరియు గద్యమైన
           నవరసంబులొలుకు నాయాసమేలేక
           ఘంటసాలవారి గళమునందు.

6 comments:

Rajasekhara Sarma said...

ghantasala gari ganamantha amdamga chepparu sastry garu

గోలి హనుమచ్చాస్త్రి said...

రాజ శేఖర శర్మగారూ!ధన్యవాదములు.తరచూ బ్లాగును వీక్షిస్తూ మీ విలువైన అభిప్రాయాలను తెలుపవలసినదిగా కోరుచున్నాను.

గన్నవరపు నరసింహమూర్తి said...

అంత తెలుగు భాష మహాత్మ్యము శాస్త్రి గారూ, ఘంటసాలకు నీరాజనము చక్కగా నిచ్చారు

గోలి హనుమచ్చాస్త్రి said...

నరసింహ మూర్తి గారికి సుస్వాగతం.తరచు బ్లాగు వీక్షణ జేసి సమీక్ష జేయవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదములు.

మిస్సన్న said...

శాస్త్రి గారూ ఘంటసాల వారని ఘనంగా కీర్తించారు.

గోలి హనుమచ్చాస్త్రి said...

మిస్సన్న గారూ ! ధన్యవాదములు.