తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 22 March 2011

ఫిబ్రవరి ౨౦౦౧౧ సుజనరంజని


ఫిబ్రవరి ౨౦౧౧ సుజనరంజని వెబ్ పత్రిక లో పూరించిన  సమస్యలు 
 
   రాముని వధియించి, సీత రావణు జేరెన్
రాముని తో యుద్ధానికి వెళుతూ రావణుడు మందోదరితో.... 

కం. భామరొ!నేనిక వచ్చెద
                   రాముని వధియించి! సీత రావణు జేరెన్
                    ప్రేమతొ యని తలచుము యిదె
                   నీమనసున! యనుచు పలికె కామాతురుడై.

 కర్ణుని పెండ్లి యాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతటన్.

వర్ణములన్ని నేర్చి తన వద్దకు వచ్చిన పుత్రుజూచి యా
               వర్ణమెకాదు మాటలను వ్రాయుము యంచును జెప్పె తండ్రి-సౌ
               వర్ణము,కృష్ణమూర్తి,పరివ్రాజక బృందము,కుంభకర్ణుడున్,   
                 కర్ణునిపెండ్లి,యాడెనటకవ్వడి,పంపగ,ద్రోవదంతటన్.నా, నానా  ' ' కార పద్యం 

కం
. నీ నాన్నే నన్ననెనా?
   
నేనే నీ నాన్న నైన నిన్ననినానా?*
    *
నీ నాన్నన్నను నేనే!
   
నానీ!నీ నాన్న నాన్న నానాన్నేనే!
*(
నిన్న+అనినానా)
*(
నీ నాన్న+అన్నను) 

4 comments:

కంది శంకరయ్య said...

బ్లాగు లోకానికి స్వాగతం! ముఖ్యంగా మీ టెంప్లేటు చాలా బాగుంది.
ఏకాక్షర పద్యం అదిరింది. పురో೭భివృద్ధిరస్తు!

మంద పీతాంబర్ said...

"న " ఏకాక్షర పూరణ ,మిగితా పూరణలు మీ సహజ పాండిత్య ప్రతిభను చాటుతున్నాయి .మీ ఏకాక్షర పూరణ నేను లోగడ శంకరాభరణం బ్లాగులో చేసిన పూరణను జ్ఞప్తికి తెచ్చింది. మీ బ్లాగులోని రెండు పోస్టులు సాంకేతిక భాషలో యుండి చదువ వీలు పడలేదు .మీకు మరొక్క మారు నా శుభాకాంక్షలు.

ఊకదంపుడు said...

నమస్కారమండీ.
బ్లాగు లోకానికి స్వాగతం.
మీకు నా శుభాకాంక్షలు

గోలి హనుమచ్చాస్త్రి said...

మొదటిసారి నా బ్లాగును వీక్షించి ఆసీస్సులందించిన శంకరం మాస్టరు గారికి వందనశతములు.
ఈ బ్లాగును వీక్షించి విలువైన సూచనలు ఇచ్చిన,శుభాకాంక్షలందజేసిన కవి మిత్రులు ఫీతాంబర్ గారికి,ఊకదంపుడు గారికి ధన్యవాదములు.
సదా మీ వీక్షణ,పర్యవేక్షణ కోరుచున్నాను.