తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 18 December 2024

సమయోచిత పద్యరత్నము – 34

 

(కోవిడ్ సమయంలో వ్రాసినది)

మత్తేభము: 

స్తవనీయుండగు జానకీపతి తగన్ తాభద్ర శైలమ్ముపై

నవనీజాతను బట్టువేళ గనగా నయ్యో నరుల్ లేరనెన్ 

దివిదేవుల్ దిగ శాంతిగల్గు ప్రజకున్  దీవింప రారండనన్  

భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.


2 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

స్తవనీయంబు భువిన్ గడున్ మిథిల సీతారామ కళ్యాణ వై
భవ సంరంభమునన్ వెలుంగ విని భావంబందు సంభావనా
జవనాశ్వంబులు పర్వగా నరుగొ క్ష్మాదేవతల్ దండిగా
భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.

గోలి హనుమచ్చాస్త్రి said...

బాగుందండీ...నమస్సులు