"భావుక" FB సమూహము వారు నిర్వహించిన "క్రోధి" "ఉగాది కవితల పోటీ" లో బహుమతి పొందిన నా పద్యములు.
ఉత్పలమాల:
కాలము మీది గానితరి గష్టములెన్నియు సైపగావలెన్
గాలము వీడిపోవు, సరికాలము వచ్చి వసంతమందులే
సోలక రండు మీరనుచు, సోయగమొప్పగ గూసె కోయిలల్
జాలినిజూపి "క్రోధి" మము జక్కగ జూడుమ నీదు పాలనన్.
ఉత్పలమాల:
చప్పని జీవితమ్ములిక చప్పున మారగ జేయ బూనుచున్
రొప్పక తీపి చేదు వగరున్మరి బుల్పుయు నుప్పు కారమే
యొప్పిన లేహ్యమున్ దినుచు నుత్సహమంది యుగాదివేళలో
తప్పులు లేక సాగుడిక ధైర్యమునందుచు వెల్గు దారిలో.
No comments:
Post a Comment