తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 12 July 2020

"గోలీ"లు - 2

కందము:
వేకువ "పోస్టుల" బెట్టుచు
తేకువ యిసుమంతలేక తెరచుచు "యఫ్ బీ"
"లైకులు', "కామెంట్స్" కొరకిటు
ఆకళ్ళాకళ్ళు జూపుటది "వేస్ట్" గోలీ!

1 comment:

Zilebi said...



లైకులు ఎఫ్బీ పోస్టుల్
వేకువ జామున కమింట్ల వేడి జిలేబుల్
తాకిన కరోన హుష్ కా
కీ! కాదనకండి దీని కిక్కును శాస్త్రీ :)



జిలేబి