శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మాకురెండు కనుల మంటలుండు

ఓం నమః శివాయ
సీసము:
ఒక్క కంటనె నిప్పు చక్కగా నీకుండు
మాకురెండు కనుల మంటలుండు
కామునొక్కని బట్టి కాల్చివేసితివీవు
మమ్మునమ్ము జనులు మసియగుదురు
విషము కంఠమునందు వెలసియుండును నీకు
కాయమంతయు మాకు గరళముండు
నందివాహనమొండు నమరియుండును నీకు
ఎద్దు మించును బుద్ధి నెన్న మాకు
తేటగీతి:
శివగుణమ్ములు నీవద్ద చిత్రమవియె
అవగుణమ్ములు మాకాయె ననెడు మమ్ము
మందబుద్ధుల దీవించ మదిని గొలుతు
తలలు మార్చెడు వాడ ! మా తలపు మార.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మాకురెండు కనుల మంటలుండు

ఓం నమః శివాయ
సీసము:
ఒక్క కంటనె నిప్పు చక్కగా నీకుండు
మాకురెండు కనుల మంటలుండు
కామునొక్కని బట్టి కాల్చివేసితివీవు
మమ్మునమ్ము జనులు మసియగుదురు
విషము కంఠమునందు వెలసియుండును నీకు
కాయమంతయు మాకు గరళముండు
నందివాహనమొండు నమరియుండును నీకు
ఎద్దు మించును బుద్ధి నెన్న మాకు
తేటగీతి:
శివగుణమ్ములు నీవద్ద చిత్రమవియె
అవగుణమ్ములు మాకాయె ననెడు మమ్ము
మందబుద్ధుల దీవించ మదిని గొలుతు
తలలు మార్చెడు వాడ ! మా తలపు మార.
No comments:
Post a Comment