శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.
తేటగీతి:
సప్త గిరులను నిలచిన శక్తివి గద
హరిగ హరునిగ తలపుల గురి కుదిర్చి
కురులనిచ్చిన దరగని సిరులనిచ్చి
భక్త జనులను రక్షించు పరమ పురుష.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.
తేటగీతి:
సప్త గిరులను నిలచిన శక్తివి గద
హరిగ హరునిగ తలపుల గురి కుదిర్చి
కురులనిచ్చిన దరగని సిరులనిచ్చి
భక్త జనులను రక్షించు పరమ పురుష.
No comments:
Post a Comment