శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁదమ్ములు శంభుఁడన్నయున్
చంపకమాల:
మలుపులు దిర్గు కావ్యమది మాన్యుడు వాల్మికి వ్రాసె, వేదముల్
తెలిపెను శూలి యొక్కడని తీరుగ భ్రాతలు లేరు లేరనిన్
పొలుపుగ కానరారు గద గాథలలో - నొక జట్టు నుండకన్
చెలువుగ రామలక్ష్మణులు ; సీతకుఁదమ్ములు ; శంభుఁడన్నయున్

No comments:
Post a Comment