శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ' సన్నకారు ' కారు.
తేటగీతి:
కారు పై మోజు గల ' సన్నకారు ' రైతు
బండి వేషము మారిచె దండి గాను
గానుగెద్దును బూనిచి తాను సాగ
రథము నెక్కెనుగా మనోరథము దీర.
No comments:
Post a Comment