శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ' మూల ' పురుషుడు ..ఈశానుడు.
కందము:
క్లేశమ్ములు రావని నరు
డీశాన్యపు మూలబెంచి యింటిని గట్టున్
ఈశా ! నీవే మూలం
బే శాస్త్రము కైన, నిడుదు నివిగో జోతల్ !
No comments:
Post a Comment