తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 7 June 2013

వర్ణ(న)చిత్రం - మాయాబజారు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న)చిత్రం - మాయాబజారు.














సీసము:
భళి భళీ యని చాటె భగవంతు లీలలు
మాయ సుందరి దివ్య మహిమ జూపె 
అసమ తసమ దీయు లనుచు భాషను నేర్పె 
వీరతాళ్ళు మెడను వేసి మెచ్చె 
పుష్టిగాను వివాహ భోజనంబును బెట్టె
విరహమందు సుఖపు విలువ జెప్పె 
ఓహొహో జగమును లాహిరీ యని యూపె
ఓంశాంతి శాంతనె నుచిత రీతి 

ఆటవెలది: 
మరపు రాక మనల మదిని మాయబజారు 
తెలుగు నాట వెలసి వెలుగు చుండె 
యస్వి,యంటియారు, అక్కినేన్రేలంగి 
సహజ నటిని గూడి సరసముగను

2 comments:

మిస్సన్న said...

వర్ణ నమ్మున కందని వర్ణమాల
మాయ బాజారు చిత్రంపు మహిమనెల్ల
సీస పద్యము నందున జిత్ర గతిని
సంతసమ్మొప్ప జెప్పిరి శాస్త్రిగారు.

గోలి హనుమచ్చాస్త్రి said...

మిస్సన్న గారూ! ధన్యవాదములు.