తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 1 December 2012

భాను కాంతి తో తారలు ప్రభలఁ జెలఁగె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - భాను కాంతి తో తారలు ప్రభలఁ జెలఁగె.

తేటగీతి: 
వంద రోజుల వేడుక బరగ నచట
వేల ప్రేక్షక జనమును,  వెలుగులీను
నటుల వేదిక నుండగ ' నటుల జంట'
భాను, కాంతి - తో తారలు ప్రభలఁ జెలఁగె.

1 comment:

కమనీయం said...


గ్రహణదినము నేడటుదిక్కు కాంచుడెటుల
కేతుగ్రస్తుడై దినకరు కిరణకాంతి
తరగిపోయె బట్టపగలె మరగునపడి
భానుకాంతితో తారలు ప్రభలు చెలగె.