తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 9 September 2012

మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.

శ్శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.

కందము:
ఏమో రసాయనమ్ముల
మామంచిగ రంగు కొరకు మాగేయుదుర
య్యా! మంచి నీటకడుగక
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.

కందము:
ప్రేమను  రసమును పీల్చుచు
నేమది జుర్రెదవు? టెంకనే మ్రింగినచో
భామా! గొంతున నిలబడి
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.




No comments: