తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 12 September 2012

మనమొక రాజహంసయయి మంచిని బెంచి సుఖించు టొప్పగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మనమొక రాజహంసయయి మంచిని బెంచి సుఖించు టొప్పగున్.
చంపకమాల:
మనుజుడటన్న  వాని ప్రతి మానస మందున మంచి చెడ్డలున్
గొనకొని చేరి యుండు మరి గొప్పగ పాలును నీర మట్టులే
ఘనతర శక్తి బొందనగు జ్ఞానము పెంపుగ జేసి, భూమి పై
మనమొక రాజహంసయయి మంచిని బెంచి సుఖించు టొప్పగున్.

No comments: