శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-08-2011 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద
తేటగీతి :
నేటి యువకులు చాటింగు నిట్లు జేయు
ముద్దు పేర్లవి క్రిస్, క్రిస్సు , లిద్దరకును
క్రీస్తు పుట్టిన రోజది క్రిస్మ సయిన
కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద !
తేటగీతి :
కొట్టుదురు గాదె పల్లెల నుట్టి, నెపుడు ?
ఇరువదైదు డిశెంబరు నేమి వచ్చు ?
ఆయుధంబెద్ది భీముడు, హనుమలకును ?
కృష్ణ జన్మాష్టమికి - వచ్చు క్రిస్మసు - గద.
No comments:
Post a Comment