తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 9 June 2012

కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.   

తేటగీతి: 
శివుని విల్లు విరచిన వశిష్ట, విశ్వ 
మిత్ర శిష్యు డైన విశిష్ట మిత్ర కులజు 
భూజ జనకజ దశరథ రాజు పెద్ద 
కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె. 

1 comment:

కమనీయం said...

1.నిండు సభయందు బడగొట్టె పాండుసుతుడు
మత్స్య యంత్రమ్ము నలవోక మహిమ మీర
జయజయ ధ్వనుల నడుమ సాగి,కుంతి
కొడుకునే భర్తగా బొంది పడతి మురిసె.

2.కడులాఘవమున యంత్రము
పడగొట్టి జనుల ప్రశంస బడసిన క్రీడిన్
వడి వరమాలను ,కుంతికి
కొడుకునె భర్తగ వరించి పడతియు మురిసెన్.