తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 4 June 2012

ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్. 

కందము: 
చక్కగ మోక్షము నిచ్చును 
మిక్కిలి భక్తిని గొలిచిన మీదట శివుడే
తిక్కల లౌకిక ములకై 
ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.


కందము: 
చక్కని కోర్కెలు కోరక 
దిక్కులకే దిక్కు హరుడు దిగిరాగానే 
ప్రక్కన వారిని త్రొక్కగ 
ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్. 

1 comment:

కమనీయం said...

దిక్కుల నెల్ల జయించియు
ఒక్కడె సర్వాధికార మొనరగ జేయన్
రక్కసుల ప్రభువు తపమున
ముక్కంటికి మ్రొక్కు వాడు మూర్ఖుడు జగతిన్