శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్
హాలాహలం పుట్టినప్పుడు లోకాలన్నీ గజగజ వణికి పోతుంటే భయపడకండి నేనున్నానని చెపుతూ... భూమాతను ప్రేమతో దగ్గరకు తీసుకుని లాలించినట్లు భావన ...
కందము:
కందుకము వోలె భూమిని
పొందికగా చేతబట్టి పోగొట్ట భయం
బందముగ హరుడు ముద్దిడ
చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్.
No comments:
Post a Comment