తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 6 May 2012

చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్

కందము:  
దడువకు, నిర్మల చిత్తము 
మడిగట్టుక, లోకమునకు మాతా పితలై 
అడిగిన చాలును రక్షిం 
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్.

3 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

గోలి వారికి అభినందనలు ...

తడయక తమ యుద్యోగుల
యిడుమలు గుర్తించి , జీతమిడి , తమకిడు న
ట్లెడ నెడ కడు గౌరవ మి
చ్చెడు వారిం గొలువ తీరు చిర కామ్యంబుల్

- ఇది నేను సూచించిన సమస్య . స్మృతికి దెచ్చి నందులకు ధన్యవాదములు .

Sasidhar Pingali said...

బాగుంది చక్కటి పూరణ

గోలి హనుమచ్చాస్త్రి said...

రాజా రావు గారూ! పింగళి శశిధర్ గారూ!స్వాగతం.మీ సహృదయ వ్యాఖ్యలకు ధన్యవాదములు.