తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 17 February 2012

కల్ల లాడు వారె కవులు గాదె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య - కల్ల లాడు వారె కవులు గాదె

 ఆటవెలది :

కల్ల లాడ మనల 'కథలుచెప్పకు' మంద్రు 
కథలు కవిత లల్ల కల్ల వలయు
ముఖము చంద్రు డనుచు  ముక్కు సంపెంగని
కల్ల లాడు వారె కవులు గాదె ! 

1 comment:

కమనీయం said...

కవిత లల్ల వలయు కాంతామణులగూర్చి,
ధనము నిచ్చు వారి ధర్మనిరతి
అప్సరస యనుచు మహా దాత యనుచును
కల్ల లాడువారు కవులు గాదె
----------------