తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 7 January 2012

కనక దుర్గ యిచ్చు కష్ట ములను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

               సమస్య -  కనక దుర్గ యిచ్చు కష్ట ములను

ఆ.వె:   తల్లి బిడ్డ కిచ్చు దండన లనుకొన
           కనక దుర్గ యిచ్చు కష్ట ములను
           పిదప ఒడిని జేర్చి పిల్లవానికి గోరు
           ముద్ద లిడిన రీతి ముద్దు జేయు. 




1 comment:

Disp Name said...

మన మేలు గోరి కాదయా
నాన్న గారు ఇచ్చు మొటిక్కాయలును
అయ్య వారు ఇచ్చు సమసల్యును
కనక దుర్గ ఇచ్చు కష్టములును !