తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 25 November 2011

యమున కేల వస్త్ర మాభరణము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-08-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                        సమస్య -  యమున కేల వస్త్ర మాభరణము.


ఆ.వె:  యముని పూజ జేయ నామె వచ్చెన ? నోనొ !
          యమున కేల? వస్త్ర మాభరణము.
          య! ముని పూజ జేయ నదిగొ తెచ్చెను చూడు
          యమున కేల వస్త్ర మాభరణము.


1. య = యస్ = ఔను

2. యమున కేల ? = యముడి కెందుకు
3. యమున కేల  = యమున చేతిలో 




2 comments:

సంపత్ కుమార్ శాస్త్రి said...

పౌరుషములతోటి వీరత్వమును జూపి,
ధూషణముల జేసి దురితమోపి,
పగల సెగలు రేగు పలనాటి సీమ క
య్యమునకేల వస్త్ర మాభరణము.

దురితము + ఓపి = దురితమోపి, దిరుతమునోపి,

గోలి హనుమచ్చాస్త్రి said...

సంపత్ గారూ! పలనాటి పౌరుషాన్ని చక్కగా చూపించారు. బాగుంది.