తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 26 October 2011

నరకిన దీపావళియే నరకాంతక కృష్ణ

               బ్లాగు వీక్షకులందరికీ
దీపావళి శుభాకాంక్షలు.
 శ్రీ మహా లక్ష్మ్యై నమః  
శ్రీ కృష్ణ శ్శరణం మమ


నరకుము మాలో పాపము
నరకుము దుర్బుద్ధి, చింత, నరకుము లేమిన్  
నరకిన దీపావళియే
నరకాంతక కృష్ణ ! నిన్ను నమ్మితి మదిలో !

3 comments:

gs said...

హనుమచ్ఛాస్త్రి గారికి మరియు బ్లాగు వీక్షకులకు,కవిమిత్రులందరుకు దీపావళి శుభాకాంక్షలు. శ్రీనివాస్

రాకుమార said...

మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీనివాస్ గారూ! ధన్యవాదములు.మీకందరకూ కూడా దీపావళి శుభాకాంక్షలు.
రాకుమార గారూ ! బ్లాగునకు స్వాగతం. రాకుమా..అని ఎప్పుడు అనను. రమ్మనే బ్లాగునకు మిమ్ములను
స్వాగతిస్తాను. మీపద్యం జాబిలి అక్కను చూడటానికి భువికి దిగాడన్న ఊహ చాల బాగుంది. శంకరాభరణంలో మీ పద్యం చూశాను. దీపావళిన శుభారంభం చేశారు. ప్రతి రోజు శంకరాభరణం లో కలుస్తారని ఆశిస్తున్నాను.నా బ్లాగును కూడా తరచుగా చూస్తూ ఉంటారని కోరుతూ..ధన్యవాదములు.