శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 26-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్
ఉ: శంభుని విల్లు బట్టి తన శౌర్యము హెచ్చగ రెండు జేసె, నీ
డింభకు డేమిజేయునని టెక్కులు బోయిన రాజపుత్రులున్
స్తంభము వోలె నిల్వ; దను జాధమ రావణు గూల్చుదౌ కథా
రంభకు, తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

No comments:
Post a Comment