తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 30 September 2011

ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె

శ్రీ చింతా రామకృష్ణ  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 18-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య - ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె

తే.గీ:  చిన్న తనమున సేవలు చేసి చేసి
          పెద్ద జేయగ; పదవుల వృద్ది నొంది
          ఎంతవాఁడైన, తన తల్లి కింత,  వాడె
          చేయ వలయును అలయక సేవ లెపుడు.

2 comments:

DARPANAM said...

పూరనతోపాటు, మంచి సందేశం కూడా
ఇచ్చారు.భళి భళి

గోలి హనుమచ్చాస్త్రి said...

"దర్పణం" సాంబమూర్తి గారూ ! ధన్యవాదములు.